We love God. We believe in God.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి అనే లక్ష్యంతో EVERY SOUL FORCHRIST అనే సంస్థ పనిచేస్తుంది. ఇది సువార్తను ప్రకటించడం ద్వారా ప్రజలను క్రీస్తు లోనికి నడిపించే క్రైస్తవ సంస్థ
ఆంధ్రప్రదేశ్ లో నేటికీ యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించని ప్రజలు 4,85,00,000మంది వున్నారు. వీరికి సువార్త అందించవలసిన భాద్యత రక్షణ పొందిన మన అందరిమీద వున్నది.
మత్తయి 28:19ప్రకారం “మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే మహా ఆజ్ఞ ను గమనిస్తే సువార్త ప్రకటించబడాలి అనే దేవుని ప్రణాలికను గమనించగలం 2వ తిమోతి 2:2 ప్రకారం మనము వినిన సువార్తను సామర్ధ్యంకలిగినవ్యక్తులకు
అందించాలి.
ఈ విధముగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి అనే లక్ష్యంతో EVERY SOUL FOR CHRIST అనే సంస్థ పనిచేస్తున్నది. ఎవరైతే సువార్తను ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి అనే ఆలోచన దేవుని ప్రణాళిక అని నమ్ముతారో వారిని దేవుని రాజ్యము కొరకు నాయకులుగా తీర్చిదిద్దుతాము.
దర్శనము :- తమ ప్రాంతములను సువార్తీకరించుటకు ఆసక్తి కలిగినవారిని గుర్తించి వారిని నాయకులుగా సిద్ధపరచుట.
లక్ష్యము :-ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలలో సువార్త ప్రకటించబడాలి.
దేవునికొరకు నమ్మకముగా జీవించే, సమర్ధవంతమైన మాదిరిని, ప్రభావాన్ని చూపించే క్రైస్తవ నాయకులను తయారు చేయుట
ఒక నమ్మకమైన క్రైస్తవ తరమును తయారు చేయుటద్వారా భవిష్యత్ తరములను సిద్ధపరచుట.

పరిశుద్దాత్మ జ్ఞానముతో పనిచేస్తూ నాయకులను 3ప్రధానమైన విధానములద్వారా అభివృద్ధిపరుస్తున్నాము.

ప్రార్ధన

ఆంధ్రప్రదేశ్ లో ఆత్మీయ అభివృద్ధి, ఫలభరితమైన సువార్తీకరణకు ఎడతెగక ప్రార్ధన చేయుట.

సిద్ధపరచుట

శ్రేష్ఠమైన నాయకత్వ సదస్సులద్వారా నాయకులను సిద్ధపరచుట

శిష్యత్వము

ప్రజలను ప్రభావితం చేయగల నాయకులను ఎన్నుకొని వారికి శిక్షణ నిచ్చుట.

We love God. We believe in God.

ఈ సువార్తీకరణ పనికొరకు సిద్దపడే స్త్రీ పురుషుల కొరకు EVERY SOUL FOR CHRIST ఎదురుచూస్తున్నది.
దేవునితో సన్నిహిత సహవాసము కలిగివుండుటకై తమను తాము ప్రతిష్ఠించుకొన్న స్త్రీ పురుషులకోసం మేము చూస్తున్నాము
క్రీస్తుని ఎరుగని వారిపట్ల భారమును కలిగి, దానిని పంచుకొను స్త్రీ పురుషుల కొరకు మేము చూస్తున్నాము
క్రీస్తు కొరకు తమ ప్రాంతమును చేరవలెను అనే ఉద్దేశము కలిగి, దాని నెరవేర్పునకై దర్శనము కలిగి దానిని పంచుకొనుచు, లక్ష్యమును నిర్దేశించి దానికొరకు ప్రోత్సహించు స్త్రీ పురుషుల కొరకు మేము చూస్తున్నాము.
కుటుంబము అనేది సంఘమును కట్టుటకు దేవునియొక్క నిర్మాణ విభాగము అని, మరియు నాయకులను పెంపొందించుటలో కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒప్పుకొనే స్త్రీ పురుషుల కొరకు మేము చూస్తున్నాము.
తమ వ్యక్తిగత జీవితములయందు, నాయకత్వము నందు ధనము, సమయము, మరియు ఆత్మీయ విషయములలో నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఉండి దాని ఫలితముగా ప్రజలకి సువార్తను అందివ్వగల స్త్రీ పురుషులకోసం మేము చూస్తున్నాము.
దేవునిపని కోసం మీకు ఆసక్తివుంటే మమ్ములను సంప్రదించండి.